సమాజంలో హత్యలు అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత వీటికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చిటెకెలు ప్రాణాలు తీస్తున్నారు. శిక్షలకు భయపడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. పట్టపగలైనా, నడిరోడ్డుపై అయినా భయం లేకుండా హత్యలకు పాల్పడుుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజా ఇలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.…
పార్కింగ్ విషయంలో తరచు గొడవలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక తాజాగా ఓ హౌసింగ్ సొసైటిలో పార్కింగ్ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ వివాదం పెద్దది కావడంతో పోలీసులు కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది. అయినా కూడా తగ్గని స్థానికులు పోలీసులపై కూడా దాడి చేశారు. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్…
చదివించి లెక్చరర్ చేస్తే.. కాళ్లను విరగ్గొట్టించింది ఓ భార్య. తనకు చదువు రాకుండా.. తన భార్య చదువుకుంటానంటే కష్టపడి చదివిస్తే.. చివరకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలో జరిగింది. తాను చదువుకునేందుకు మద్ధతిచ్చానని.. కానీ తన భార్య దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు భర్త.
దళితులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి దారుణాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఉచితంగా చికెన్ ఇవ్వనందుకు ఒక దళితుడిపై కొందరు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. Also Read: Elon Musk:…
నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో ఘోరమైన ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. అయితే, తాజాగా ముజఫర్నగర్లో భజన కీర్తన పాడినందుకు వివాదంలో చిక్కుకున్న ముస్లిం గాయకుడి సోదరుడు ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఖుర్షీద్.. సింగర్ ఫర్మానీ నాజ్ కి వరుసకు తమ్ముడవుతాడని పోలీసులు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం.
2011లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కటారియాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక మేజిస్ట్రేట్ రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వును ప్రకటించారు.
ఈ నెల 20 నుండి తెలంగాణ లో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.. 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు.. వారంరోజులు తెలంగాణలో ఎమ్మెల్యేల టూర్.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజక వర్గంలో వారం పాటు బస.. పార్టీ పరిస్థితి, స్థానిక పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు..