Harassment: సైకిల్పై వెళ్తున్న విద్యార్థినిపై వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్‌ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్‌పై నుంచి వచ్చి విద్యార్థినిపై పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రోడ్డుపైనే పడి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని చికిత్స పొందుతోంది.
Road Accident: కెనాల్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృత్యువాత
Also Read
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత సోమవారం 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వెంబడించి వేధించారు. అంతేకాకుండా.. బైక్ తో ఆమె సైకిల్‌ను ఢీకొట్టడంతో విద్యార్థిని కిందపడిపోయింది. దీంతో ఓ యువకుడు ఆమెపై బలవంతంగా దాడికి యత్నించాడు. ఆ సమయంలో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. యువకుడు బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థిని మెడ, ముఖంపై గాయమైంది.
Bandi Sanjay: మహిళా బిల్లు విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి..
ప్రస్తుతం బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గుర్తు తెలియని యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఎస్పీ హేమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ.. విద్యార్థినిపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని.. విద్యార్థినిని విచారించగా కొందరి పేర్లు చెప్పినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని ఎస్‌ఎస్పీ హేమ్‌రాజ్ మీనా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!