సమాజంలో హత్యలు అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత వీటికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చిటెకెలు ప్రాణాలు తీస్తున్నారు. శిక్షలకు భయపడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. పట్టపగలైనా, నడిరోడ్డుపై అయినా భయం లేకుండా హత్యలకు పాల్పడుుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజా ఇలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
రోజురోజుకు ఉత్తరప్రదేశ్ లో దిగజారుతున్న పరిస్థితులకు దీనిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని తలకి తుపాకి గురిపెట్టి కాల్చి చంపారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో 18 నెలల తన చిన్నారి కూడా అతని భుజంపై ఉంది. ఇది చూసిన చిన్నారి భయంతో వణికిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగిన ఈ భయంకరమైన హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Monkey Fight with Dog: పిల్లలను అన్నం తిననివ్వని తల్లి కుక్క.. కోపం వచ్చిన కోతి ఏం చేసిందంటే
ఈ వీడియోలో షోయబ్ అనే 28 ఏళ్ల వ్యక్తి తన 18 నెలల చిన్నారిని భుజాలపై ఎక్కించుకొని ఆనందంగా కబుర్లు చెబుతూ నడుస్తూ ఉంటాడు. తన కోసం మృత్యువు ఎదురుచూస్తుందని తెలియని అతను చుట్టుపక్కలు అంతగా గమనించకుండా చిన్నారితో ఆనందంగా మాటలు చెబుతూ ఉంటాడు. ఇంతలో అతని ఎదురుగా వస్తున్న వ్యక్తి సడెగా గన్ తీసి అతని తలపై కాలుస్తాడు. దీనితో ఆ వ్యక్తి ఒక్కసారిగా నేలపై విలవిలలాడుతూ పడిపోతాడు. అతని వెనుక బైక్ పై మరో ఇద్దరు వెయిట్ చేస్తూ ఉండగా షోయబ్ ను కాల్చిన వెంటనే నిందితుడు ఆ బైక్ ఎక్కి వెళ్లిపోతాడు. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి షోయబ్ ను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూసిన వారి గుండెలను పిండేస్తోంది.షోయబ్ బతకాలని ఇది చూసిన వారు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ చూసిన ఆ చిన్నారి ఎంత భయపడి ఉంటుందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ పనికి ఒడిగట్టిన వారిని వదలొద్దని పట్టుకొని వెంటనే శిక్ష విధించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Source: Amar Uajala
For. More details… Read herehttps://t.co/6gKyUJjAPW
— زماں (@Delhiite_) August 14, 2023