ఎంత తెలివిగల వారైనా అప్పుడప్పుడు చిన్న తప్పు చేయడం వల్ల దొరికిపోతుంటారు. నేను తోపు స్కెచ్ వేస్తే తిరుగుండదు అని అనుకునే వారు కూడా చిన్న మిస్టేక్ చేసి దొరికిపోతుంటారు. అలానే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా స్టైల్ లో కథ అల్లిన ఓ యువకుడు దొరికిపోయాడు. కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటిలో వారు తనని వెతకకుండా ఉండేందుకు చిరుతపులి దాడిలో చనిపోయాడని అందరినీ నమ్మించాడు. దీని కోసం మంచిగా ప్లాన్ వేసి తప్పించుకున్నా అనుకున్నాడు. అయితే కొన్ని రోజులకు అతను చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులు చేతికి చిక్కాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: COVID19: షాకింగ్ సర్వే.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి వందమందిలో ఆరుగురు ఏడాదిలోపే మృతి
అసలేం జరిగిందంటే..యూపీలోని బిజ్నోర్ జిల్లా బేగంపూర్ షాదీకి చెందిన లలిత్ కుమార్ కు ఇటవలే పెళ్లి జరిగింది.
పెళ్లయింది. గతంలో మనోడికి కుటుంబంతో సఖ్యత లేదు. పెళ్లి తర్వాత వివాదం మరింత ముదిరింది. అందుకే ఇంటి నుంచి పారిపోవాలని పథకం వేశాడు. తమ గ్రామానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉండే ఓ అడవిలో తన బైక్, చెప్పులు, ఫోన్, బట్టలు అక్కడక్కడా పడవేశాడు. గతంతో అక్కడ చాలా సార్లు చిరుత దాడి చేయడంతో తనపై కూడా చిరుత దాడి చేసి చంపేసిందని అందరు అనుకుంటారని లలిత్ భావించాడు. కుటుంబ సభ్యులు లలిత్ గురించి వెతికి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి వెతకగా అతని వస్తువులు తప్ప మృతదేహం లభ్యం కాలేదు. అంతేకాకుండా అతని ఫోన్ లో ఒక సిమ్ లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి సిమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందా అని ఎదురుచూశాడు. ఇంట్లో నుంచి పారిపోయిన లలిత్ చంఢీగడ్ లోని అతని స్నేహితుల వద్దకు వెళ్లాడు. వారితోనే చాలా రోజులు ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత తాను తీసుకువెళ్లిన సిమ్ కార్డు వాడటం కోసం స్నేహితుల ఫోన్ లో ఆ నెంబర్ వేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిచి వారికి అప్పగించారు. ఇలా అతను చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు దొరికిపోయాడు.