Uttar Pradesh: దేశంలో వ్యక్తిగత కక్షలతో దాడులు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దుండగులకు తుపాకులు సైతం అందుబాటులో ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చని వారిపై.. తమను ఎదిరించిన వారిపై దాడులు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే వివాదాల్లో సైతం ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘటనే సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన ఘటన జరిగింది. తన చిన్నారి కూతురిని భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కొందరు దుండగులు దగ్గరి నుంచి కాల్చారు. అయితే ఈ దాడిలో చిన్నారి క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సోమవారం తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని సమీపం నుండి కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Jasprit Bumrah Back: ఐర్లాండ్‌కు టీమిండియా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా లుక్ వైరల్!
ఈ దాడిలో కుమార్తె క్షేమంగా ఉండగా వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో బాధితుడు ఇరుకైన సందులో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో అతనికి ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి తుపాకీని తీసి సమీపం నుంచి కాల్చాడు. బాధితుడు వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అతని కుమార్తెకు దాడిలో ఎటువంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వ్యక్తితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిపిన వ్యక్తి మరో ఇద్దరిని బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు షోయబ్ అనే 30 ఏళ్ల వ్యాపారి అని పోలీసులు ప్రకటించారు. ఆయన షాజహాన్‌పూర్‌లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వ్యక్తిపై దాడి చేసిన నిందితుల్లో ఇద్దరు గుఫ్రాన్, నదీమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వాడిన బైక్‌ను కూడా సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మూడో నిందితుడు తారిఖ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీనియర్ పోలీసు అధికారి అశోక్ మీనా మీడియాకు తెలిపారు. నిందితుల్లో ఒకరు బాధితురాలి బంధువు అని చెప్పిన పోలీసులు.. పాత వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.