Parents Killed Pregnant Daughter: కూతురుపై ఉన్న మమకారాాన్ని తల్లి దండ్రులు మరిచారు. తమ కూతురు మరొకరికి జన్మనివ్వబోతుందని తెలిసినా, ఆమె నిండు గర్భవతి అని అర్థం అవతుున్నా ఆమెపై జాలి చూపలేదు. కనికరం లేకుండా ఆమెను కన్నవారే కడతేర్చారు. ఈ దారణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులే కన్న కూతురిని కర్కశంగా చంపేశారు.
వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ మజాఫర్నగర్కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే పెళ్లికి తమ ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో 2022 అక్టోబర్లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వారిని డిసెంబర్ లో పట్టుకున్నారు. ప్రియుడిపై కేసు పెట్టి జైలులో పెట్టారు. ఈ క్రమంలో యువతిని ఆమె తల్లిదండ్రలు వారి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరగుతూ ఉంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది.
Also Read: France: ఇది తెలిస్తే మందుబాబుల గుండె పగిలిపోతుంది.. ఆల్కహాల్ ను కొని నాశనం చేస్తున్న ప్రభుత్వం
అయినప్పటికీ రాహుల్ కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురిని పలుమార్లు బలవంతం చేశారు. అయినప్పటికి ప్రియుడికి వ్యతిరేకంగా తనను రేప్ చేశాడంటూ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. అయితే శనివారం స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక విచారణ జరగాల్సి ఉంది. అయినప్పటికి యువతి, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లలేదు. దీంతో వారు ఎందుకు రాలేదో విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూతురిని తల్లిదండ్రులే చంపి నదిలో పారేసినట్లు గుర్తించారు. కూతురు తమ మాట వినకపోవడం వల్లే చంపేశామని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ని సార్లు అడిగిన రాహుల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు మా కూతురు అంగీకరించలేదు, అందుకే చంపేశామని తెలిపారు. దీంతొ యువతి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.