UP Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Viral Video: ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముఖ్యంగా దాంట్లో ‘‘సన్‌రూఫ్’’ ఫీచర్ ఉందా..? లేదా..?అనేది చూస్తున్నారు. సన్‌రూఫ్ ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎస్యూవీ సెగ్మెంట్లోని ప్రతీ కారుకి కూడా సన్‌రూఫ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్గా గుర్తించారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్‌కేస్ కనిపించింది. అనుమానం రావడంతో సూట్‌కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్‌బాడీ ఉంది. ముందుగా ఈ సూట్‌కేస్‌ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)లో శుక్రవారం రాత్రి (నవంబర్ 15) భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ నుంచి రూ.25 లక్షలు మోసం చేసిన ఘటన సంచలనం రేపింది. జగదీష్ చంద్ర బరేలీకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఏదో ఒక కమిషన్‌లో పెద్ద పదవి ఇప్పిస్తానని దుండగులు మోసం చేశారు. జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mutton Curry: మటన్ ముక్కుల కొట్లాటకు దారి తీసింది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందులో ఈ గలాటా జరిగింది. నవంబర్ 14న జరిగిన ఈ విందు కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వెయ్యి మందికి పైగా ఆహ్వానించినప్పటికీ, హాజరైన వారు కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీ మాత్రమే వడ్డించడంపై అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి…