Sambhal Violence: సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- యూపీలోని సంభాల్ లో జామా మసీదు వద్ద సర్వే సమయంలో ఉద్రిక్తత..
- సమాజ్ వాది ఎంపీతో పాటు ఎమ్మెల్యే కొడుకుపై పోలీస్ కేసు నమోదు..
- బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ కృష్ణ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ సిండే రాజీనామా..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
అయితే, ఈ దాడిలో పలువురు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గాయపడగా.. ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్ప వాయువును పోలీసులు ప్రయోగించడంతో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు మరణించగా.. సోమవారం మరొకరు చనిపోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ పిలుపుతోనే ఈ హింస నెలకొందని జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.
Read Also: Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ఇక, బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారి కృష్ణ కుమార్ తెలిపారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. అంతకు ముందే ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే ఈ దారుణం జరిగిందన్నారు. కాగా, హింస చెలరేగడంతో సోమవారం సంభాల్ లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. 24 గంటల పాటు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!