ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు.
Bus Fire Accident: ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో బాద్సా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని సమాచారం. హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. Read…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో దోపిడీ ఆరోపణలపై గ్రామస్థులు ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్థులు తెలిపారు.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు.
వ్యాపారాన్ని ప్రారంభించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ధైర్యం, అభిరుచి ఉంటే ఏదైనా సులభమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి దీన్ని నిరూపించింది. ఆమె కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ ప్రారంభించింది. ఈ రోజు తన కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు పైగా ఉంది. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది.
Terror Attack In J&K: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్‌లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు.
పాము మరణం తర్వాత పగ తీర్చుకుంటాయని సినిమాలు, కథలలో వినే ఉంటారు. అయితే వాస్తవానికి అలాంటి ఉదంతం యూపీలోని బరేలీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పొలంలోకి వచ్చిన పామును ఓ యువకుడు చంపేశాడు. ఆ యువకుడు పామును దారుణంగా చితకబాదాడు.
నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
Lucknow Hotels Bomb Threats: లక్నోలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. ఇందులో హోటల్ ఫార్చ్యూన్, హోటల్ లెమన్ ట్రీ, హోటల్ మారియట్ సహా 10 పెద్ద హోటళ్ల పేర్లు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా హోటళ్లను బాంబులతో బెదిరించారు. అంతకుముందు కూడా బాంబు పేలుస్తామని బెదిరిస్తూ అగంతకులు పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్ పంపారు. ఈ హోటళ్లలో బాంబుల నివేదికల మధ్య, ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలకు సంబంధించి కూడా పెద్ద…
ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.