Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఈ రోజు తీవ్ర హింస చెలరేగింది. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకి ఆదేశించింది. ఈ సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసింది. మసీదు హింవదూ దేశాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందనే వాదనలపై కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్‌లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్‌లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు…
Bypoll Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్, యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొంది. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి-పీటీ ఉపాద్యాయుడు మధ్య తీవ్ర ఫైటింగ్ జరిగింది. ఇద్దరూ కొట్టుకుంటుండగా విద్యార్థి తల్లి, సోదరి కూడా రంగంలోకి దిగి ముష్టి యుద్ధానికి దిగారు.
UP Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Viral Video: ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముఖ్యంగా దాంట్లో ‘‘సన్‌రూఫ్’’ ఫీచర్ ఉందా..? లేదా..?అనేది చూస్తున్నారు. సన్‌రూఫ్ ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎస్యూవీ సెగ్మెంట్లోని ప్రతీ కారుకి కూడా సన్‌రూఫ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్గా గుర్తించారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్‌కేస్ కనిపించింది. అనుమానం రావడంతో సూట్‌కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్‌బాడీ ఉంది. ముందుగా ఈ సూట్‌కేస్‌ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి.