ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆస్తి వివాదం కారణంగానే నిందితుడు ఈ డబుల్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జబరులి గ్రామంలో జగదీష్ వర్మ (70), అతని భార్య శివప్యారి (68) నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు బ్రిష్కిత్ అలియాస్ లాలా.. చిన్న కొడుకు దేవదత్. జగదీష్ వర్మ వృత్తిరీత్యా కమ్మరి. చాలా రోజులుగా ఆయన పెద్ద కొడుకు బ్రిష్కిత్‌తో ఆస్తి విషయంలో వివాదం నడుస్తుందని.. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Sai Pallavi: మా అమ్మ చీర కట్టుకునే రోజు కోసం వేటింగ్ : సాయి పల్లవి
కాగా.. శనివారం రాత్రి జగదీష్, శివప్యారి తమ పెద్ద కొడుకు లాలాతో గొడవ పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొడుకు సుత్తితో వారిపై దాడికి దిగాడు. దీంతో.. తల్లిదండ్రులు తమను కొట్టొదని ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఈ సంఘటనలో తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులను మోహన్‌లాల్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో చేర్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. మరోవైపు.. నిందితుడి కోసం గాలింపు బృందాలను మోహరించినట్లు మోహన్‌లాల్‌గంజ్ ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని అన్నారు.