Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దీనిని స్టార్టప్ ప్రపంచంలోని యూనికార్న్ మహా కుంభ్ అని చెప్పవచ్చని అన్నారు.
Read Also: Sandeep Kishan : పీపుల్స్ స్టార్ ట్యాగ్ వివాదం పై స్పందించిన సందీప్ కిషన్
“ఇది నాకు చాలా ముఖ్యం. ఈ రోజు నేను బ్రజ్ భూమికి వచ్చాను, దీని వెనుక ఆధ్యాత్మిక , సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఇది చాలా కాలంగా భారతదేశ నాగరికత, సంస్కృతిని ప్రభావితం చేసింది” అని ఆయన అన్నారు. ఈ సారి కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం చెప్పారు. ప్రజలను వారి ఆధ్యాత్మిక మూలాలకు, సాంస్కృతిక వారసత్వానికి తిరిగి తీసుకురావడానికి కుంభమేళా ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.