అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆదివారం మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స తీసుకుంటూ బుధవారం మృతిచెందారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో సత్యేంద్ర దాస్ ముఖ్యపాత్ర పోషించారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇళ్ల స్థలాల లబ్ధిదారులపై పునర్విచారణ..
సత్యేంద్ర దాస్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ‘‘శ్రీరాముని పరమ భక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ మరణం చాలా విచారకరం, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
Uttar Pradesh CM Yogi Adityanath condoles the demise of Chief Priest of Ayodhya Ram temple, Acharya Satyendra Das.
The CM says "The demise of Acharya Shri Satyendra Kumar Das Ji Maharaj, the supreme devotee of Lord Ram and the chief priest of Shri Ram Janmabhoomi Temple, Shri… pic.twitter.com/H50i2UECxm
— ANI (@ANI) February 12, 2025