CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించిన డీఫ్ ఫేక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. యోగి ముస్లింలు ధరించే టోపీని ధరించినట్లు కొందరు నఖిలీ వీడియోను సృష్టించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో భారత న్యాయ సంహిత(BNS), IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Lavanya: నన్ను వాళ్లు చంపేస్తారు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు..
నివేదికల ప్రకారం.. యోగి ఆదిత్యనాథ్ స్కల్ క్యాప్ ధరించి ఉన్న డీప్ ఫేక్ వీడియో ‘‘ప్యారా ఇస్లాం’’ అనే ఫేస్‌బుక్ అకౌంట్‌లో కనిపించింది. దీనిపై నర్హి ప్రాంతంలోని బీజేపీ నేత రాజ్ కుమార్ తివారీ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా యూజర్లు మార్ఫింగ్ చేసిన వీడియోపై తీవ్రంగా స్పందించారు. దీని వెనక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోను తాము గుర్తించామని, అవసరమైన చర్యలు తీసుకున్నామని లక్నో పోలీసులు ఒక పోస్ట్‌కు స్పందించారు.
గతేడాది మేలో ఇలాంటి సంఘటనలో, నోయిడాకు చెందిన ఒక వ్యక్తి యోగి డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు. ఈ కేసులో నిందితుడిని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. దేశవ్యతిరేక అంశాలను చెబుతూ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ వీడియోని ఉపయోగించారని యూపీ అడిషనల్ డీజీపీ అమితాబ్ యష్ చెప్పారు.
– @Uppolice @gorakhpurpolice @lkopolice
This Youtuber is sharing a deepfake clip of @myogiadityanath with harmful and communal intentions which is criminal as per new BNS
Kindly take appropriate action pic.twitter.com/FhT27JoMQB
— Hindutva Knight (@HPhobiaWatch) February 12, 2025