ఉత్తర ప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. లఖీంపూర్ ఖేరీ లో నిరసనలు చేపడుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారని, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారని ఆరోపణలు. దీంతో కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, లఖీంఫూర్ ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ ఉన్నట్టుగా నిరూపిస్తే తాను మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని ఆశిశ్ మిశ్రా పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయలో తన కుమారుడు అక్కడ లేరని, ఆందోళన కారులే కారుపై రాళ్లు రువ్వి నలుగురు మృతికి కారణమయ్యారని ఆశిశ్ మిశ్రా ఆరోపించారు.
Read: చైనాలో పెరుగుతున్న ఘోస్ట్ సిటీలు…