యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేపట్టారు.
సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్.. రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు వాహనాలపై దాడి చేశారు. వాటికి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంమంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రే కారణంగా తెలుస్తోంది. లఖీమ్‌పూర్‌లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రైతులపై కాన్వాయ్ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ ఖండించారు. దీనికి యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతుల రాళ్ల దాడితో కారు బోల్తా పడిందని.. కారు కింద పడి ఇద్దరు చనిపోయారని చెబుతున్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ముగ్గురు బీజేపీ కార్యకర్తలతో పాటు తన డ్రైవర్‌ను కొట్టి చంపారని.. ఘటనా స్థలంలో తన కుమారుడు లేడని అన్నారు. మరోవైపు దీనితో తనకు సబంధం లేదని వాదిస్తున్నారు ఆశిష్ మిశ్రా. మరోవైపు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. రైతుల మృతి దురదృష్టకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు లఖీంపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని లక్నోలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.
- Tags
- crime
- Farmers
- Uttar Pradesh
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!