మానవత్వం నసిస్తోంది. అనుమానం పెనుభూతంలా మారుతోంది. అనుమానంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడటంలేదు. ఏంజరుగుతుంది అనుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ఒకరు వేధిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరి కొందరు ఎదుటివారిపై అనుమానంతో వారి ప్రాణాలు తీసేందుకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా యూపీ మారింది. వరుస ఘటనలతో యూపీ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వితంతువు అయిన తన కోడలిని సుత్తితో కొట్టి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ ట్వింకిల్‌గా గుర్తించారు పోలీసులు. మృతురాలకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. యూపీ.. మీరట్ జిల్లాలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్‌తో ట్వింకిల్‌కు 2017లో వివాహమైందని, 2021లో ట్రక్కు ప్రమాదంలో ఆమె భర్త మరణించారని సర్కిల్ ఆఫీసర్ లోనీ రజనీష్ ఉపాధ్యాయ్ పోలీసులకు తెలిపారు. అయితే.. భర్త చనిపోవడంతో.. తన కోడలు తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసిన నిందితుడు అభిషేక్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం అర్థ రాత్రి అతను అనుకున్న పథకం ప్రకారం మొదటి అంతస్తులోని ఆమె గదికి చేరుకుని విచక్షణా రహితంగా ఆమె తలపై సుత్తితో కొట్టి, శరీరాన్ని పలుచోట్ల కోశాడని పోలీసులు తెలిపారు. అభిషేక్‌ను అరెస్టు చేసి, ఇంట్లో నుండి ఒక సుత్తిని స్వాధీనం చేసుకున్నారు.
read also: Century in 100th ODI Match: వందో మ్యాచ్‌లో ‘వంద’ చేసిన ఆటగాళ్లు
ఇక యూపీలోనే మరో ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపుల కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు సర్కిల్ అధికారి సునీల్ దత్ తెలిపారు. ఇప్పటి వరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుంగర్హి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ గ్రామానికి చెందిన బాలిక.. 11వ తరగతి చదువుతుందని, విద్యార్థిని అని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఈసందర్భంలో.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారని, బాలిక ఎన్నిసార్లు కోరినప్పటికీ ఆ యువకుడు వేధిస్తూనే ఉన్నాడని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సింగ్ తెలిపారు. తల్లిదండ్రుల వద్ద నుంచి ఫిర్యాదు రాగానే.. నిందుతుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Apple Watch: ‘ఆపిల్ వాచ్’ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక