Panipuri Challenge: ఈ పానీపూరీ తింటే రూ.500 మీదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panipuri Challenge in uttar pradesh: పానీపూరీ పేరు చెప్పగానే కొందరికి నోట్లో నీళ్లూరుతాయి. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు మన పానీపూరీ ప్రియులు. ఈ రేంజ్‌లో పానీపూరీ లవర్స్ ఉంటే.. ఎవరైనా పానీపూరీ ఛాలెంజ్ అంటే ఎగబడకుండా ఉండగలరా?. అయినా ఓ వ్యక్తి బస్తీమే సవాల్ అంటూ పానీపూరీ ఛాలెంజ్ విసురుతున్నాడు. తాను ఇచ్చే పానీపూరీ తింటే రూ.500 ఇస్తా అని బెట్ కడుతున్నాడు.
Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని శిఖోహాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి పానీపూరీలు విక్రయిస్తుంటాడు. తాజాగా అతడు ఓ సవాల్ విసిరాడు. ఇంతకీ ఆ సవాల్ ఏంటంటే.. .. మామూలు గప్‌చుప్‌తో పోలిస్తే రెండింతలు ఉండే భారీ పూరీ.. దాని నిండా కూర, మసాలా దట్టించి.. పుల్లటి పానీ నింపి అందిస్తాడు. ఆ పూరీని ఒక్కబుక్కలో తినేయాలి. ఒక్క చుక్క పానీ కూడా కిందపడకూడదు. అలా ఎవరైనా తినేస్తే వెంటనే రూ.500 ఇచ్చేస్తానని ప్రకటించాడు. ఒకవేళ తినకపోతే గప్‌చుప్ ఖరీదు రూ.100 చెల్లించాలని చెప్తున్నాడు. దీంతో చాలామంది ఈ పానీపూరీ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకూ ఆరుగురు మాత్రమే విజేతలుగా నిలిచారు. మరి మీరు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలంటే యూపీ వెళ్లాల్సి ఉంటుంది.
https://www.facebook.com/brijwasisomesh/videos/953138935297443/
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!