Agnipath Scheme recruitment exam : అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
Read Also: Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం
అగ్నివీర్ ఫేజ్-1 పరీక్ష ఆదివారం రోజున ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, కాన్పూర్, పాట్నాలోని పలు సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. భారత సైన్యంలోని మూడు విభాగాల్లో స్వల్పకాలికంగా పనిచేసేందుకు అగ్నిపథ్ పథకాన్ని జూన్ 14న కేంద్ర ప్రకటించింది. అగ్నిపథ్ పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్న యువకులను సాయుధ బలగాల్లోకి నాలుగేళ్ల కాలపరిమితితో తీసుకుంటారు. ఆ తరువాత 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు. మిగిలిన 75 శాతం అగ్నివీరులను రిటైర్మెంట్ సమయంలో రూ.11-12 లక్షల ప్యాకేజీ లభించనుంది. ఆ తరువాత కావాలంటే కేంద్ర సాయుధ బలగాల్లో వీరి చేరే అవకాశం కూడా ఉంది. కేంద్ర హోంశాక పరిధిలోని వివిధ సర్వీసుల్లో అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది కేంద్రం.
ఇదిలా ఉంటే ఇప్పటికే అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ నేవీకి 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ స్కీమ్ పెట్టిన సమయంలో దీన్ని వ్యతిరేకిస్తూ.. పలు రాష్ట్రాల్లో విధ్వంసం జరిగింది. బీహార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రైల్వే ఆస్తులను యువకులు ధ్వంసం చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళన, నిరసనకార్యక్రమాలు చేశారు.