రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని, నాటో దళాలతో పోలిస్తే రష్యా సైన్యం తక్కువే అని, కానీ, అణ్వాయుధవ్యవస్థ బలంగా ఉన్న దేశం రష్యా అని అధ్యక్షుడు…
ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైనవి కుక్కలు. యజమానుల యెడల అవి చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా మంది కుక్కలను తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. యజమానులు రిస్క్‌లో ఉన్నప్పుడు కుక్కలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, కుక్కలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటిని కాపాడుకోవడం యజమానులు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. యూఎస్ లోని కొలరాడోలోని పోలీసులకు ఓ కాల్ వచ్చింది. కారులో మంటలు చెలరేగాయని, వెంటనే రావాలని…
ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్‌సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కారోనా మహమ్మారిలో సార్స్‌కోవ్ 2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్రపంచంపై దాడి చేశాయి. సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపగా, ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నది. అయితే, కొత్త వేరియంట్లు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయో ముందుగానే గమనిస్తే వాటిని ఎదుర్కొనడం తేలిక అవుతుంది. దీంతో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ల పుట్టుకపై దృష్టి…
ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు…
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు…
సాధారణంగా సైనికులకు ఇచ్చే శిక్షణ ఏ దేశంలో చూసుకున్నా కఠినంగా ఉంటుంది. శిక్షణకోసం పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా శిక్షణ ఇస్తాయి. అయితే, థాయ్‌లాండ్ దేశంలో సైనికులను ఇచ్చే శిక్షణ చాలా దారుణంగా ఉంటుంది. అడవుల్లో తిరిగే పురుగులను, జంతువులను, పాములను చంపి తినేలా ట్రైనింగ్ ఇస్తారు. వియాత్నం, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో అడవులు అధికంగా ఉంటాయి. అంతేకాదు, అక్కడ ప్రమాదకరమైన విష జంతువులు అధికంగా…
అమెరికా సంయుక్త రాష్ట్రల్లో మంచు తుఫానులు కురుస్తున్నాయి. ఈ మంచు తుఫానుల కారణంగా మంచు రోడ్లపై కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నది. ఫలితంగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోతున్నది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలెవరూ బయటకు రావడంలేదు. ఇక జంతువుల పరిస్తితి చెప్పాల్సిన అవరసం లేదు. కొన్ని రకాల జంతువులు చలిని తట్టుకోలేక చనిపోతున్నాయి. ఇలాంటి వాటిల్లో ఇగ్వానస్ అనే ఊసరవెల్లి జాతికి చెందిన జంతువు ఒకటి. ఇవి శీతల రక్త జంతువులు. అయితే, ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలు…
దేశంలోని ప్రజల కోసం ఒకవైపు ఆహారాన్ని సమకూర్చుకుంటూనే, మరోవైపు క్షిపణీ ప్రయోగాలు చేస్తున్నది ఉత్తర కొరియా. 2022 జనవరిలో ఇప్పటి వరకు మొత్తం 7 క్షిపణీ ప్రయోగాలు చేపట్టింది. ఆదివారం ఉదయం సమయంలో ఉత్తర కొరియా భారీ క్షిపణిని ప్రయోగించి షాకిచ్చింది. ఇప్పటి వరకు స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా 2017 తరువాత మరోసారి భారీ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భూమినుంచి 2000 కిమీ ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి జపాన్ సముద్రంలో…