పారాసిటమాల్ టాబ్లెట్ ను జ్వరానికి వినియోగిస్తారు. కరోనా కాలంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జ్వరం, తలనొప్పి, చిన్నపాటి ఒళ్లునొప్పులు వచ్చినా వెంటనే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. అయితే, పారసిటమాల్ ట్యాబ్లెట్లను జ్వరానికి మాత్రమే కాదు, పాములు చంపడానికి కూడా వినియోగిస్తున్నారట. అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ పాములు లక్షల సంఖ్యలో ఉన్నాయి. 1950 కాలంలో తొలి బ్రౌన్‌ట్రీ స్నేక్‌ను గుర్తించారు. 40 ఏళ్ల కాలంలో ఈ గువామ్ దీవిలో లక్షల సంఖ్యలో బ్రౌన్ ట్రీ స్నేక్‌లను గుర్తించారు. వీటి సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలుగుతున్నది.
Read: అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో…
విద్యుత్ తీగల మరమ్మత్తుకు సంవత్సరానికి 4 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుండటంతో బ్రౌన్ ట్రీ స్నేక్‌ల సంఖ్యను తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమయింది. చనిపోయిన ఎలుకల్లోకి పారాసిటమాల్ ను ఇంజెక్ట్ చేసి వాటిని గువామ్ అడవుల్లో వదిలేస్తున్నారు. బ్రౌన్‌ట్రీ పాములు ఎలుకలను తినేసి చనిపోతున్నాయి. ఈ పాముల సంఖ్యను తగ్గించేందుకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం కృషి చేస్తున్నది. రెండో ప్రపంచ యుద్దానికి ముందు అక్కడ బ్రౌన్ ట్రీ పాములు ఉండేవి కాదని, జపాన్ నుంచి ఈ పాములు అమెరికాకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.