ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నది. ఎలాంటి జబ్బులను నయం చేయడానికైనా మందులు అందుబాటులో ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇంతటి వైద్యం అందుబాటులో లేదు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. తీవ్రమైన జబ్బులు వస్తే నాటు వైద్యం చేసేవారు. లేదా ఆ జబ్బులతో బాధపడుతూ మరణించేవారు. ఇక వేల సంవత్సరాల క్రితం వైద్యం ఎలా ఉంటుంది… అసలు వైద్యం గురించి అప్పట్లో ప్రజలకు తెలుసా లేదా అంటే, 2 వేల ఏళ్ల క్రితమే అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని అంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. 2వేల ఏళ్లనాటి పెరువియన్ యోథుడి పుర్రెను ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పుర్రె యూఎస్‌లోని మ్యూజియంలో ఉంచారు.
Read: బ్రాండ్ నేమ్ వాడొద్దు…. తెలంగాణ వైద్యులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆ పుర్రెకు ఒక పక్క చిన్న ఐరన్ ప్లేట్ వేసి ఉంది. పుర్రెకు గాయం కావడంతో ఆపరేషన్ నిర్వహించి పుర్రెకు ఐరన్ ప్లేట్‌ను అమర్చి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే, పుర్రెకు ఆపరేషన్ చేసిన తరువాత ఆ మనిషి కోలుకొని బతికారని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. పురాతన కాలంలో అత్యాధునిక వైద్య శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, దీనికి ఉదాహరణ ఈ పెరువియన్ యోధుడి పుర్రె అని చెప్పుకొచ్చారు.