30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను తిరిగి రష్యా తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు లక్ష సైన్యాన్ని రష్యా మోహరించింది. అయితే, అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే సైనికసాయం అందిస్తామని అంటోంది. ఇప్పటికే 8500 మంది సైనికులను బాల్టిక్ సముద్రంలో మోహరించింది. అయితే, సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు తరలించేందుకు అమెరికా ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో చేర్చుకోవడంగాని, నాటో దేశాల సైనికులను ఉక్రెయిన్‌లో మోహరించడంగాని చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని రష్యా హెచ్చరించింది. నాటో కూటిమిలోని జర్మనీ సైన్యాన్ని పంపేందుకు ఇప్పటికే నిరాకరించింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లు సైనికసాయం చేస్తామని చెబుతున్నాయి.
Read: 5 నిమిషాల్లో రూ. 4 లక్షల కోట్లు…
ఒకవేళ ఉక్రెయిన్‌కు సైనికసాయం అందిస్తే రష్యా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా ఈ విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తున్నది. రష్యాతో బలమైన సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అమెరికా చూస్తున్నది. రెండు బలమైన దేశాలే. అయితే, ఈ సమయంలో రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకుంటే తిరిగి రష్యా ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ సమస్యను అమెరికా పరిష్కరించకుండా తప్పుకుంటే ఆ దేశానికి మరింత చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికే పెద్దన్నగా అమెరికా గత చరిత్ర క్రమంగా మసకబారుతున్నది. దీని నుంచి బయటపడాలి అంటే ఉక్రెయిన్ సమస్యను అమెరికా పరిష్కరించి తీరాలి.