Natasha Perianayagam: భారతీయ-అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగం(13) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా వరసగా రెండో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్(సీవైటీ) పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచారు నటాషా. 76 దేశాల్లోని 15,000 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. కేవలం 27 శాతం కంటే తక్కువ మంది ఈ పరీక్షల్లో అర్హత సాధించారు. వీరిలో నటాషా తొలిస్థానంలో నిలిచారు.
Dead Body In Fridge: కన్న తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ కొందరు తన తల్లిపై ఉన్న పిచ్చి ప్రేమతో వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. వారు చనిపోయిన వారి గుర్తులను ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేకంగా ఉంచుకుంటారు.
Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు.
China spy balloon: అమెరికా, చైనా మధ్య హై ఆల్టిట్యూడ్ బెలూన్ ఒకటి ఉద్రిక్తతలను పెంచుతోంది. చైనా నిఘా బెలూన్ గా అనుమానిస్తున్న అమెరికా దాన్ని కూల్చేందుకు సిద్ధం అయింది. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు కన్నా పైన ఈ బెలూన్ ఉన్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఈ బెలూన్ ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. నిఘా కోసమే దీన్ని చైనా ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని కూల్చేందుకు అమెరికా తన ఎఫ్-22 ఫైటర్ జెట్లను…
US Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించేశాయి. ఆయా కంపెనీలతో దశాబ్ధాల కాలం అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా తొలగించాయి. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి.
Donald Trump on Russia-Ukraine conflict: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వాడిని అని ట్రంప్ వెల్లడించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే మిలియన్ సంవత్సరాల్లో కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని అన్నారు.
Gunfire In USA : అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇటు భారత్, అటు యూకేలు స్పందించాయి. వలసవాద మనస్తత్వంగా ఈ డాక్యుమెంటరీని అభివర్ణించింది భారత ప్రభుత్వం. మరోవైపు ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక యూకేలో దీనిపై ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు డాక్యుమెంటరీని సమర్థించగా.. మరికొందరు ప్రధాని మోదీకి మద్దతు పలికారు.
IBM Cuts 3,900 Jobs In Latest Tech Layoffs: ఐటీ ఉద్యోగులను కంపెనీలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 ఉద్యోగాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ బుధవారం వెల్లడించింది.…
Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్,…