US flood aid to Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భారీ ఆర్థిక సాయం చేసింది అమెరికా. వరదలతో అతలాకుతలం అయిన పాకిస్తాన్ ను ఆదుకునేందుకు 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణం, వ్యాధులు ప్రభలకుండా, ఆర్థిక వృద్ధి, ఆహారం కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. మానవతా సాయం కింద పాకిస్తాన్ కు నిధులు ఇస్తున్నట్లు యూఎస్ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. గతంలోొ కూడా వరద…
Kilauea Volcano In Hawaii Erupts Again: హవాయిలోని కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ పేలింది. జనవరి 5 నుంచి అగ్నిపర్వతం బద్ధలు అవుతూనే ఉంది. గత నవంబర్ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలింది. ఆ తరువాత ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి.
అగ్రరాజ్యమైన అమెరికాలో గన్కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో శుక్రవారం ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Elon Musk : ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన టైం ఏం బాగోలేదు.
Economic Slowdown In These 3 Countries Will Impact The World In 2023 says IMF: ప్రపంచదేశాలు ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు, అమెరికా, చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఒక్క భారతదేశ ఆర్థిక పరిస్థితి మాత్రమే బాగుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే…
Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
10 nations on alert for China arrivals, demand negative Covid report: చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యను చెప్పడానికి కూడా అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రోజుకు దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరిలో ఈ కేసుల సంఖ్య ఆల్ టైం…
Russia accuses US of plot to eliminate Vladimir Putin to end Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదో నెలకు చేరుకుంది. అయినా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మరింతగా ఆయుధ సహాయం, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అంటూ రష్యా…
Russia-Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని నియంత్రిస్తుందన్నారు. రష్యా యుద్ధభూమిలో ఉందని.. విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.