Chinese Spy Balloons: అమెరికాతో పాటు ఇండియాపై బెలూన్‌తో నిఘా పెట్టిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Spy Balloons: డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా అక్రమంగా ఇతర దేశాలపై గూఢచర్యం చేస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమెరికా వాయుసేన జెట్ ఫైటర్లతో కూల్చేసింది. బెలూన్ శకలాలను సేకరిస్తోంది. బెలూన్ లో ఏ పరికరాలు ఉన్నాయి, ఏ ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉంది.. ఎలాంటి సమాచారాన్ని సేకరించింది.. బెలూన్ లో ఉన్న పరికరాలకు సంబంధించి సఫ్లై చైన్స్ వివరాలను కూడా అమెరికా సేకరించే పనిలో ఉంది. 11 కిలోమీటర్ల వ్యవధిలో పడిన బెలూన్ శకలాలను వెలికితీస్తోంది అమెరికా.
Read Also: Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?
Also Read
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
ఇదిలా ఉంటే చైనా ఒక్క అమెరికా మీదనే కాకుండా స్పై బెలూన్ల ద్వారా భారత్, జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌లోని సైన్యం కదలికలపై నిఘా పెట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఇండియాతో పాటు దాని మిత్రదేశలకు ఈ సమాచారాన్ని పంచుకుంది. అమెరికా డిప్యూటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ 40 దేశాల రాయబార కార్యాలయాలతో సమాచాారాన్ని పంచుకున్నారు. హైనాన్ ప్రావిన్స్‌లో చైనా సైన్యం ఒక బేస్ ఏర్పాటు చేసుకుని ఈ స్పై బెలూన్ల ద్వారా నిఘా పెడుతున్నారని చెప్పారు.
చైనాకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలని చూస్తున్న జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్ మరియు ఫిలిప్పీన్స్ దేశాల సైనిక సమాచారాన్ని నిఘా బెలూన్లు సేకరించాయని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం తెలిపింది. గత కొంత కాలంగా హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్ మీదుగా కనీసం నాలుగు బెలూన్లను గుర్తించారు. ఇదిలా ఉంటే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, చైనా రక్షణ మంత్రితో మాట్లాడాలని ప్రయత్నించినా..చైనా నుంచి స్పందన లేదు.
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!