Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.
IT layoffs put US work visas of Indians at stake: సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే భారతీయులకు ఓ కల. ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు, ఇక అమెరికాలో ఉద్యోగం అయితే డాలర్లలో సంపాదన. చివరకు తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిలను ఐటీ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునేంతగా ఈ ఉద్యోగం భారతీయ సమాజంపై ప్రభావం చూపింది. చాలా మందికి అమెరికా అనేది డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ కలలు చెదిరిపోతున్నాయి. ఐటీ…
California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.…
US Reply To Query On BBC Documentary Critical Of PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చరచ్చ అవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీ మీడియా రిపోర్టుపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. యూకే ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. పాకిస్తాన్ మూలలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లలో మోదీ…
Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్లో కాల్పులు ఘటన జరిగింది.
Pakistan may lose major non-Nato ally status: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. తమను రక్షించాలని పాశ్చాత్య దేశాలను అడుక్కుంటోంది. అక్కడి ప్రజలు కనీసం గోధుమ పిండి కూడా దొరకడం లేదు. గోధుమ పిండి కోసం అక్కడ ప్రజలు కొట్లాడుతున్నారు.
Indians See US As Biggest Military Threat After China, says Survey: భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు.…
Miss Universe 2022: మిస్ యూనివర్స్ 2022 కిరీటం అమెరికాకు చెందిన ఆర్బోని గాబ్రియేల్ ను వరించింది. అమెరికాలోని లూసియానలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఈ పోటీల్లో ఆర్బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకుంది. 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 84 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో పాల్గొన్నారు. మిస్ వెనుజులా ఫస్ట్ రన్నరప్ గా నిలువగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. మిస్ యూనివర్స్ 2021గా…
More classified documents found from US President Biden's residence, private office: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో మరన్ని రహస్య పత్రాలను కనుక్కున్నట్లు వైట్ హౌజ్ గురువారం తెలిపింది. ఈ రహస్య పత్రాలు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభం అయింది. వాషింగ్టన్ లోని బైడెన్ ప్రైవేటు ఆఫీస్ నుంచి ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు
Best Companies In US: డబ్బు విషయం పక్కపెడితే.. చేసే పనిలో ఇష్టం, మానసిక ప్రశాంతత ఉండాలని ప్రతీ ఉద్యోగి కోరుకుంటారు. అలాగే కోట్లు సంపాదించినా ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోలేము.