Tax Survey on BBC:భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ టాక్స్ సర్వే చేపడుతోంది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. ఐటీ పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయాల్లో రైడ్స్ చేస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ధిక్కరించిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ టాక్స్ సర్వేపై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు.
2024లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు భారతీయ-అమెరికన్, అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రకటించారు. దీంతో, వైట్‌హౌస్‌కు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేసిన మొదటి రిపబ్లికన్‌గా ఆమె అవతరించారు.
గగనతలంలో గుర్తు తెలియని వస్తువులపై అమెరికా దండయాత్ర కొనసాగుతోంది. ఆదివారం మరో వస్తువును అమెరికా వాయుసేన కూల్చివేసింది. దానికి ముందురోజే కెనడా గగనతలంలో ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
Canada: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. అమెరికా ఫైటర్ జెట్లు దీన్ని కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో…
Domestic Flight : ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విభిన్నమైన, అద్భుతమైన, విచిత్రమైన, ఫన్నీ, విషయాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది.
China Spy Balloon: అమెరికా, చైనాల మధ్య స్పై బెలూన్ వివాదం నడుస్తూనే ఉంది. చైనా బెలూన్ సాయంతో పలు దేశాలపై గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆర్మీ ఏకంగా బెలూన్ ప్లీట్ ను నిర్వహిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కనిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. దీనిపై ప్రస్తుతం అక్కడి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బెలూన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఏ శాటిలైట్ తో ఈ…
Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
Laptop catches fire onboard Newark-bound United Airlines flight: అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Chinese Spy Balloons: డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా అక్రమంగా ఇతర దేశాలపై గూఢచర్యం చేస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమెరికా వాయుసేన జెట్ ఫైటర్లతో కూల్చేసింది. బెలూన్ శకలాలను సేకరిస్తోంది. బెలూన్ లో ఏ పరికరాలు ఉన్నాయి, ఏ ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉంది.. ఎలాంటి సమాచారాన్ని సేకరించింది.. బెలూన్ లో ఉన్న పరికరాలకు సంబంధించి సఫ్లై చైన్స్ వివరాలను కూడా అమెరికా…