Dead Body In Fridge: కన్న తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ కొందరు తన తల్లిపై ఉన్న పిచ్చి ప్రేమతో వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. వారు చనిపోయిన వారి గుర్తులను ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేకంగా ఉంచుకుంటారు. కానీ ఓ యువతి తన తల్లి చనిపోయినా ఆమె శవాన్ని రెండేళ్ల పాటు ఫ్రిజ్లోనే పెట్టుకుని జీవిస్తోంది. ఈ విషయం తన కన్న కూతురికి కూడా తెలియనివ్వలేదు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని చికాగోలో ఇల్లినాయిస్‌లో ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ తన 96 ఏళ్ల తల్లి రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. అయితే ఆ విషయం బయటకు పొక్కనీయకుండా అత్యంత జాగ్రత్తపడింది. ఆమె ఇల్లినాయిస్‌లోని రెండు అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం సెల్లార్‌లోని డీప్ ప్రీజ్‌లో చికాగో పోలీసులు ఆమె తల్లి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బ్రాచర్‌ని అదుపులో తీసుకున్నారు.
Read Also: Magha Masam Temple Rush: తెలుగు రాష్ట్రాల్లో మాఘమాసం సందడి… ఆలయాల్లో రద్దీ
విచారణలో ఆమె తల్లి పేరుతో తప్పుడు ఐడీని కలిగి ఉన్నట్లు కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మైఖేల్ పెకారా చెప్పారు. అంతేగాదు బ్రాచర్ తన తల్లి చనిపోవడానికి రెండేళ్ల కిందే డీప్ ఫ్రీజర్‌ని కోనుగోలు చేసినట్లు ఉన్న రసీదును కూడా ఆమె నివాసం వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అసలు ఎందుకలా ఆమె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియకుండా దాచి ఉంచిందన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ తన తల్లి మరణం దాచడం ద్వారా ఎవా బ్రాచర్ పొందే సామాజిక భద్రతా ప్రయోజనం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బ్రాచర్ కూతురు సబ్రినా వాట్సన్ తన తల్లికి ఎవరీ పట్ల ప్రేమ ఉండదని, ఆఖిరికీ తనమీద కూడా ఉండదంటూ కన్నీటి పర్యతమయ్యింది. కనీసం ఆమెకు మానవత్వం కూడా లేదంటూ.. అమ్మమ్మ మిచాల్స్కీ తలుచుకుంటూ విలపించింది.