China VS Taiwan: తైవాన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముడుతోంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ). తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తో భేటీ కావడం చైనాకు రుచించలేదు. ఈ చర్య అనంతరం తైవాన్ ను కబలించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం భారీ…
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేరని, చైనా తీరును ఖండించింది భారత్. చాలా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని దక్షిణ టిబెట్ పేరుతో పలుస్తోంది చైనా. ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే పేర్లను మార్చింది.
World Bank lowers India's FY24 growth forecast to 6.3%: ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్య పరిస్థితుతలతో సతమతం అవుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వృద్ధి దారుణంగా ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీటన్నింటి ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 4-5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో తప్పకుండా ఆర్థిక…
Donald Trump: అమెరికాలో ఎప్పుడూ జరగని విధంగా ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హుష్ మనీ కేసులో పోలీసులు ట్రంపును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం న్యూయార్క్ లో ని మాన్ హటన్ లోని కోర్టులో హాజరయ్యారు ట్రంప్. ఆయనపై మొత్తం 34 అభియోగాలను నమోదు అయ్యాయి. అయితే తాను దోషిని కానని ట్రంప్ కోర్టు ముందు తెలిపారు.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపణలు, లైంగిక వేధింపులు ఇలా పలు అభియోగాల్లో ఇరుక్కున్నారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి న్యాయమూర్తులు ట్రంపును విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అరెస్టు జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. 2016 ఎన్నికల ముందు తనతో సెక్స్ చేసిన విషయాన్ని దాచేందుకు 1,30,000 డాలర్లను ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తోంది. మాన్ హటన్ అటార్నీ, గ్రాండ్ జ్యూరీ విచారణకు అనుమతించిన 24 గంటల్లోనే ట్రంప్ పై…
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు రాహుల్ గాంధీ అంశంపై స్పందిస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం జర్మనీ కూడా రాహుల్ గాంధీ అంశంపై స్పందించింది. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని జర్మనీ తెలిపింది. రాహుల్ గాంధీ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్…
Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.