Walnut: కొన్ని సార్లు సోషల్ మీడియాలో శాశ్వతంగా నిలిచిపోయే చాటింగ్స్ జరుగుతుంటాయి. కొన్ని సార్లు కొంతమంది ఇచ్చిన రిప్లైలను ఎప్పటికీ మరిచిపోలేము. అలాంటిదే ‘వాల్నట్’ సీఈఓ రోషన్ పటేల్ కు ఓ మహిళ నుంచి ఎదురైంది. రెండేళ్ల క్రితం జరిగిన సంభాషణలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 2021లో తన స్టార్టప్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నియమించుకోవాలని రోషన్ పటేల్ భావించాడు. ఆ సమయంలో…
26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్ను అమెరికా…
చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి.
Dollars : ఈ కాలంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారున్నారు. ఆర్థికంగా బాగానే ఉన్నా.. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
Illicit Relationship: ఆరుగురు మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక సంబంధాలు నెరపడంతో అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెండు రోజలు వ్యవధిలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని డాన్ విల్ కు చెంది ఎలెన్ షెల్(38) 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెంది హెథర్ హరే(32) మరో టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదు అయింది.
Joe Biden - Rishi Sunak: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవం సందర్భంగా జో బైడెన్ మంగళవారం యూకేలోని ఉత్తర ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయనకు స్వాగతం పలికేందుకు బెల్ఫాస్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సమయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రదేశాల నేతల పర్యటనలో ఒకరినొకరు పట్టించుకోని సంఘటనలు ఎప్పుడైనా చూశామా.?
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
Texas dairy farm explosionఅమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. డిమ్మిట్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో ఈ దుర్ఘటన జరిగింది. హఠాత్తుగా జరిగిన భారీ పేలుడు మూలంగా ఫామ్ లో ఉన్న 18,000 అవులు మృతి చెందాయి. అందులో పనిచేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి
Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేసింది.