BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్లెట్ మాల్లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు.
Brain Surgery On Baby In Womb: అమెరికన్ వైద్యులు అత్యంత అరుదైన బ్రెయిన్ సర్జరీ చేశారు. గర్భంలో ఉన్న శిశవుకు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా గర్భంలో ఉన్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మెదడులో అరుదైన రక్తనాళాల అసాధారణ పరిస్థితిని సరిచేసేందుకు వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. ‘‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మెషన్’’(VOGM) అనే అరుదైన వైకల్యంతో బాధపడుతున్న శిశువుకు బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్…
Dead Body : కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ప్రస్తుతం కూటి కోసం కాకుండా కోట్ల కోసం జనం పరిగెత్తున్నారు. తానూ మనిషినే అన్న సంగతే మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని వదిలి మనీ మాయలో పడిపోతున్నాడు.
USCIRF report: భారతదేశం అంటే పక్షపాతంగా వ్యవహరించే అమెరికాలోని కొన్ని సంస్థలు మరోసారి అలాంటి ప్రయత్నాన్నే చేశాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత్ లోకి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో 2022లోనూ భారత్ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లోనూ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
Brain Moments Before Death: సైన్స్ అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నా ఇప్పటికి మనిషి మెదడు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. మానవ మెదడుకు సంబంధించి అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పటీకి ఎంత తెలుసుకున్నా.. చాలా సమాచారం అసంపూర్తిగా మిగులుతూ ఉంటోంది. అయితే చనిపోతున్న సమయంలో మానవ మెదడు ఏవిధంగా ప్రవర్తిస్తుందనే విషయంపై తాజాగా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
అమెరికాలో గన్ కల్చర్ పై విమర్శలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తుపాకి హింసను కట్టడి చేసేందుకు న్యూయార్క్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న గన్ లను ఇస్తే.. గిఫ్ట్ కార్డులు ఇస్తామని ప్రకటించింది.
Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్లోని క్లీవ్ల్యాండ్లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి…
Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.
అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.