Huge Tornado Destroys US Towns: అమెరికాను టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు పట్టణాలు ధంసం అయ్యాయి. తీవ్రమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షంతో టోర్నడోలు విరుచుకుపడటంతో మిసిసిపి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే వీటి ధాటికి 25 మంది మణించారు. మరణాల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మిసిసీపిలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
Donald Trump: తనపై అభియోగాలు మోపితే మరణాలు, విధ్వంసమే అని ట్రంప్ హెచ్చరించారు. స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ విచారణలో అభియోగాలు మోపితే బాగుండంటూ మాన్ హట్టన్ అటార్నీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ స్టార్ తో సంబంధాల గురించి బయటపడకుండా డబ్బులతో ప్రలోభపెట్టాడనే కేసును మాన్ హట్టన్ అటార్నీ విచారించేందుకు సిద్ధం అయిందని, తనపై అభియోగాలు మోపి రోజుల్లో అరెస్ట్ చేస్తారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు…
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్…
Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ప్రభుత్వ వార్త సంస్థ కేసీఎన్ఏ సోమవారం ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించింది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాని కిమ్ తప్పుపట్టారు. ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసి, ఆయనపై నేరాలు మోపితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయం అని ప్రపంచ టాప్-1 బిలియనీర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే వారం ట్రంప్ పై అభియోగాలు మోపుతారనే వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదే జరిగితే ఆయన అద్భుత విజయం ఖాయమని అన్నారు.
People Fall Sick With Mysterious Illness On A US Cruise Ship: అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఏకంగా 300 మంది అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నారు. మిస్టరీ వ్యాధి బారిన పడినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) నివేదించింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో ఈ ఘటన…
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షన వనరులను ఉపయోగించుకుని మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి…
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ పట్టణం బఖ్ముత్ లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఈ పట్టణం రష్యా వశం అయితే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టుకోల్పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అయినా బఖ్ముత్ ను స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశం పట్టుదలతో ఉంది.