Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Storms Hit US: అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో…
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…
Operation Sindoor: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు, ఆ ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్‌ని భారత హతం చేసింది. బుధవారం తెల్లవారుజామున పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద కార్యాలయాలు, వాటి శిక్షణా శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో, జైషే టాప్ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ కూడా…
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ఒక మైలురాయి చిత్రంగా రూపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్త మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ, గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించనున్నారు. కన్నప్ప యూఎస్ఏ టూర్ మే 8న న్యూజెర్సీలో ఆరంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్విక్లోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో సమావేశమై ముచ్చటించనున్నారు. Read More:Nani: బ్లడీ రోమియో మొదలెట్టేది అప్పుడే! మే 9న డల్లాస్‌కు…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్‌కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు.
USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
Tulsi Gabbard: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై యావత్ ప్రపంచం భారత్‌కి అండగా నిలుస్తుంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపారు. మతం ఆధారంగా, హిందువుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే, ప్రపంచ దేశాల నాయకులు, ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద అణిచివేతలో తాము భారత్‌కి అండగా నిలబడుతామని చెప్పారు.
Pakistan: బంగ్లాదేశ్ దారిలోనే పాకిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై నిరసనగా పాలస్తీనాకు మద్దతుగా బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్, బాటా షోరూంలపై అక్కడి నిరసనకారులు దాడులు చేశారు. తాజాగా, పాకిస్తాన్లో కూడా కేఎఫ్‌సీ టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై 20 వేర్వేరు దాడులు నమోదయ్యాయి. ఒక ఉద్యోగిని కాల్చి చంపారు. ఈ దాడులకు సంబంధించి దాదాపుగా 160 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు శనివారం తెలిపారు.