లాస్ ఏంజిల్స్ లో శనివారం నుంచి అధికారులు ఇప్పటి వరకు సుమారు 400 మందిని అరెస్టు చేశారు. వీరిలో 330 మంది వలసదారులు ఉండగా, మరో 157 మందిని వారికి మద్దతు తెలిపినందుకు అదుపులోకి తీసుకున్నారు.
Los Angeles: అమెరికాలోని అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్ అధికారులు లాస్ ఏంజిల్స్ లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకారులను తీవ్రంగా హెచ్చరించారు.
అమెరికా కొత్తగా విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని తొలగించడమే కాకుండా.. జూలై 9 నుంచి ప్రతిపాదిత 16 శాతం అదనపు సుంకాన్ని కూడా అమలు చేయకూడదని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా ఈ సుంకాలను తొలగించకపోతే, అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగించే హక్కు కూడా తమకు ఉంటుందని ఈ సమావేశంలో భారత ప్రతినిధులు తెలిపారు.
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు.
ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్‌కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Read Also: CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి…
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఉగ్ర ఘటన తర్వాత, పాశ్చాత్య మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, వెస్ట్రన్ దేశాల ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడి చేస్తుంటే, వింత ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ప్రజల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్‌కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌ని కాళ్ల బేరానికి తెచ్చాయి.