US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు.
ట్రంప్ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది.
Israel Iran Conflict: ఇరాన్ పై మరోసారి విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. టెహ్రాన్ లోని ఆరు ఇరానియన్ సైనిక విమానాశ్రయాలను దాడి చేయగా.. అందులో ఉన్న 15 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు పేర్కొన్నాయి.
Hands off Iran: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతలతో యూఎస్ ప్రధాన నగరాల్లో ఇరాన్‌కి మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం ఇప్పుడు తీవ చర్చనీయాంశంగా మారింది.
Hormuz Strait: ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణమం తీసుకుంది.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని హెచ్చరించారు. అంతకుముందు రోజు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ‘
Israel Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిణామాలు ప్రపంచదేశాలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణు ఫెలిసిటీలు లక్ష్యంగా శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది.
Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. అయితే, ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్ కాదు ఫేయిల్డ్ మార్షల్’’ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా, ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో…
Trump Gold Card: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్ కార్డు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. 5 మిలియన్ డాలర్లు (రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నారు.