Storms Hit US: అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్‌కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో బాధాకరమైన ఉదయం అని బెషియర్ అన్నారు. ఆయన రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
Read Also: PSLV C61: పీఎస్‌ఎల్‌వీ – సి61 ప్రయోగం విఫలం.. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే..
అలాగే మిస్సోరీలోని గవర్నర్ మైక్ కీహో కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఏడుగురు మరణించగా, వారిలో ఐదుగురు సెయింట్ లూయిస్ నగరంలో మృతి చెందారు. సెయింట్ లూయిస్ మేయర్ కారా స్పెన్సర్ ప్రకారం.. ఈ నగరంలో తుఫాను 38 మందికి గాయాలు కలిగించగా, 5,000 ఆస్తులకు నష్టం వాటిల్లింది. లారెల్ కౌంటీ షెరీఫ్ జాన్ రూట్ ఈ పరిస్థితిని “మాస్ క్యాజువాల్టీ ఈవెంట్”గా వర్ణించారు. శిథిలాల కింద ఇంకా బతికినవారిని వెలికితీయడానికి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.
Read Also: Minister Ponguleti: మళ్ళీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాం..
ఈ విధ్వంసం 2021 డిసెంబరులో మేయ్‌ఫీల్డ్ పట్టణాన్ని చుట్టుముట్టిన భారీ తుఫానును గుర్తు చేస్తోంది. అప్పట్లో 22 మంది మరణించగా, వారిలో 8 మంది ఒక కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మృతి చెందారు. ఈ ఘటనలతో పాటు ఆ దేశంలో వర్జీనియాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీలో రెండు వేర్వేరు ఘటనల్లో వృక్షాలు కార్లపై పడటంతో ఇద్దరు మరణించారు. న్యూజెర్సీలో కూడా ఒక టోర్నడో నమోదైంది. ఈ ప్రకృతి విపత్తుతో అమెరికా మిడ్వెస్ట్ ప్రాంతంలో వాతావరణ భయానకంగా మారింది. శిథిలాల మధ్య భద్రతా బృందాలు ప్రాణావసర సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.