Trump-Musk: ట్రంప్, మస్క్ మధ్య దోస్తాన్ ఎక్కడ చెడింది..?
- డొనాల్డ్ ట్రంప్- ఎలాన్ మస్క్ మధ్య చెదిరిన దోస్తాన్..
- నేను లేకపోతే ట్రంప్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయేది: మస్క్
- మస్క్ కి నాకు మంచి దోస్తాన్ ఉంది.. ఇకపై అది కొనసాగదు: ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది. ట్యాక్స్ తగ్గింపు బిల్లును ట్రంప్ సపోర్టు ఇస్తుండగా.. మస్క్ దానిపై బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. కాగా, టెస్లా చీఫ్ తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనకు ఎదురు తిరడంపై స్పందించిన అమెరికా అధినేత నేను అస్సలు పట్టించుకోనని సమాధానం ఇచ్చాడు. తాను తెస్తున్న బిల్లు ద్వారా ఖర్చులను 1.6 ట్రిలియన్ డాలర్లు తగ్గడంతో పాటు పన్ను తగ్గింపులు లభిస్తాయని వెల్లడించారు. అయితే, బిల్ పాస్ కాకుండా నిలిపివేస్తే ప్రస్తుతం ఉన్న దాని కంటే 68 శాతం అధిక ట్యాక్సులు విధిస్తానని ట్రంప్ బెదిరించారు.
Read Also: Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
అయితే, మరోపక్క ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో తాను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయే వారని చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. మస్క్ చేసిన ఈ కామెంట్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని ట్రంప్ అన్నారు. మా ఇద్దరికీ మంచి దోస్తాన్ ఉంది.. అయితే ఇకపై అది కొనసాగుతుందని తాను అనుకోవటం లేదని చెప్పుకొచ్చారు. అసలు బిల్లు తయారీలో ఏం జరుగుతుందనే విషయం అందరికంటే ఎక్కువ మస్క్ కి తెలుసని.. ఇప్పుడెందుకు ఇలా అతడు మారిపోయాడో అర్థం కావటం లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
Read Also: Parle-G Biscuits: రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
కాగా, అమెరికాలో అత్యంత గోప్యంగా ఉంచబడిన ఎప్‌స్టిన్ ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందని ఎలాన్ మస్క్ పెద్ద బాంబు పేల్చారు. నిజాలు అన్ని భవిష్యత్లులో బయటకు వస్తాయంటూ ట్వీట్ చేశాడు. అందుకే ట్రంప్ ఈ పత్రాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ట్రంప్ గతంలో ఎప్‌స్టిన్‌తో తనకు గతంలో పరిచయం ఉందని ఒప్పుకున్నప్పటికీ, తన నేర కార్యకలాపాలలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చాడని మస్క్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!