Trump vs Musk: ఎలాన్ మస్క్ అక్రమ గ్రహాంతరవాసి.. అమెరికా వదిలి వెళ్లిపోవాలి..
- డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య బహిరంగ విమర్శలు..
- మస్క్ ఓ అక్రమ గ్రహాంతరవాసిగా అభివర్ణించిన వైట్ హౌస్ మాజీ సలహాదారు..
- అమెరికా ప్రభుత్వం మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థను సీజ్ చేయాలి: స్టీవ్ బానాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump vs Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య బహిరంగ విమర్శలు చేసుకోవడం వరల్డ్ వైడ్ గా ఆసక్తి రేకెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు కలిసి తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఇక, అమెరికా ప్రభుత్వం ఎలాన్ మస్క్ ఇమ్మిగ్రేషన్ అంశంపై విచారణ చేయాలని స్టీ్వ్ బెనాన్ డిమాండ్ చేశారు. ఎందుకుంటే అతడు వేరే గ్రహం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చినట్లున్నారు.. వెంటనే ఆయన్ను దేశ బహిష్కరణ చేయాలని కామెంట్స్ చేశారు. కొరియా యుద్ధం నాటి చట్టాల ప్రకారం.. దేశ రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వైద్య సామగ్రి తదితర ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. ఈ మేరకు ప్రైవేట్ వ్యాపారులను ఆదేశించే అధికారం అధ్యక్షుడిగా ట్రంక్ హక్కు ఉంటుంది అన్నారు. ఆ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఉపయోగించాలని స్టీవ్ బెనాన్ కోరారు.
Read Also: Nara Lokesh: ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు..
ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను విడుదల చేసి.. స్పేస్‌ఎక్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని మాజీ వైట్ హౌస్ సలహాదారు బానాన్ పేర్కొన్నారు. అర్ధరాత్రిలోగా ఆ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యూఎస్ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ నుంచి చైనాకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎలాన్ మస్క్ దొంగలించేందుకు ప్రయత్నించారని తీవ్రంగా ఆరోపించారు. వెంటనే, మస్క్‌కు భద్రత నిలిపివేయాలి, అంతేకాకుండా అతడికి చెందిన సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని స్టీవ్ బానాన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!