Pakistan: బంగ్లాదేశ్ దారిలోనే పాకిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై నిరసనగా పాలస్తీనాకు మద్దతుగా బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్, బాటా షోరూంలపై అక్కడి నిరసనకారులు దాడులు చేశారు. తాజాగా, పాకిస్తాన్‌లో కూడా కేఎఫ్‌సీ టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై 20 వేర్వేరు దాడులు నమోదయ్యాయి. ఒక ఉద్యోగిని కాల్చి చంపారు. ఈ దాడులకు సంబంధించి దాదాపుగా 160 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు శనివారం తెలిపారు.
Plotting to kill Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్న 17 ఏళ్ల నికితా కాసాప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రంప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పథకం ప్రకారం, తన తల్లిదండ్రుల్ని హత్య చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఇతడిని అరెస్ట్ చేశారు. విస్కాన్సిన్‌కి చెందిన నికితా కాసాప్ ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా కాసాప్(35), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్(51)వారి ఇంట్లోనే కాల్చి చంపాడని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరిద్దరి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…
USA: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించాడు. ట్రంప్ దెబ్బతో అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పరుగు తీస్తున్నారు. విదేశీ వస్తువులపై సుంకాలు ప్రకటించిన కొన్ని రోజు తర్వాత, ధరలు తక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువుల్ని కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో స్టోర్లు, సూపర్ మార్కెట్ల ముందు రద్దీ పెరిగింది.
పోషక విలువలు కలిగిన గుడ్లను రోజు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు మండిపోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాల విధించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్‌కు గుడ్లు తలనొప్పిని పెంచాయి. ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న…
India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సోమవారం యూఎస్ కాంగ్రెస్‌లో జో విల్సన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ సెనెటర్ తన ఫిబ్రవరి డిక్లరేషన్‌లో, సోమవారం అమెరికన్ పార్లమెంట్లో ‘‘పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్’’ని తీసుకువచ్చారు.
Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్‌లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్‌లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పలు దేశాలపై పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత వస్తువులపై భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు…