Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని హెచ్చరించారు. అంతకుముందు రోజు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ‘‘ ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు. అతడిని చంపడం పెద్ద పని కాదు. కానీ ప్రస్తుతానికి మేము చంపము. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి’’ అని హెచ్చరించారు.
Read Also: Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘దెయ్యాల ఆవాసం’.. స్టార్ హీరోయిన్ సంచలనం!
“ఇరాన్, ఇరాన్ దేశం మరియు దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు భాషలో మాట్లాడరు ఎందుకంటే ఇరాన్ దేశం లొంగిపోదు. ఏదైనా యూఎస్ సైనిక జోక్యం నిస్సందేహంగా కోలుకోలేని నష్టంతో కూడుకున్నదని అమెరికన్లు తెలుసుకోవాలి” అని సుప్రీం లీడర్ అన్నారు.
ట్రంప్ హెచ్చరికల తర్వాత తాజాగా ఖమేనీ నుంచి స్పష్టమైన హెచ్చరిక రావడంతో ఈ యుద్ధం మరింత తీవ్రం అవుతుందని స్పష్టమవుతోంది. ట్రంప్ హెచ్చరించిన తర్వాత బుధవారం టెలివిజన్ సందేహంలో ఖమేనీ మాట్లాడుతూ.. ‘‘ ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతుంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే, అమెరికా కూడా మిడిల్ ఈస్ట్‌లోని తన సైనిక ఆస్తుల్ని యాక్టివేట్ చేసింది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధంలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.