Trump Gold Card: త్వరలో ట్రంప్ కార్డ్.. గోల్డ్ కార్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు
- గోల్డ్ కార్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
- 5 మిలియన్ డాలర్లు చెల్లించిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం అందజేత..
- ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపిన డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Gold Card: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్ కార్డు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. 5 మిలియన్ డాలర్లు (రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నారు. తాజాగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి వెబ్‌సైట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారు. 5 మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ రానుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. యూఎస్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు అనేక మంది కాల్ చేసి.. ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారు.. అయితే, ఈ గోల్డ్ కార్డ్ ఇంకా కొనుగోలుకు అందుబాటులోకి రాలేదు అన్నారు. కాగా, ప్రస్తుతం వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కార్డు లేదా గోల్డ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారు Trumpcard.gov అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది.
Read Also: Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏదైనా జరిగితే అమెరికాదే బాధ్యత అన్న ఇరాన్
Also Read
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
కాగా, పౌరసత్వ కార్డులతో వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత మేర తగ్గించ వచ్చు అనే అభిప్రాయంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా స్థానంలో దీన్ని తీసుకు వస్తున్నారు. అయితే, ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా యూఎస్ లో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డు అందజేస్తారు.. ఇక, ఈ గోల్డ్ కార్డుల అమ్మకంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పర్చచాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు అనుకుంటున్నారు. అర్హత కలిగిన విదేశీయులకు ఈ కార్డులను అమ్మడంతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు . ఈ ట్రంప్ కార్డు వెంటనే అమెరికా పౌరసత్వాన్ని కల్పించక పోయినప్పటికీ.. దాన్ని పొందేందుకు రూట్ ని క్లియర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!