Donlad Trump: కర్మ అనేది ఎవరినీ వదలదు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సేమ్ ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైంది ఇప్పుడు. గతంలో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కాలు జారీ కిందపడిన సందర్భంలో అతడిపై ట్రంప్ సెటైర్లు వేశారు. తాజాగా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు ట్రంప్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా యూజర్లు డొనాల్డ్ ట్రంప్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Meghalaya: నా కూతురికి ఏ పాపం తెలియదు.. సీబీఐ విచారణకు సోనమ్ తండ్రి డిమాండ్
అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతుండగా కాలు జారింది. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి ఒక్కసారిగా పైకి లేచాడు. ఆ తర్వాత రూబియో సైతం కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. జో బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి ట్రంప్ మావా అప్పుడు బైడెన్ పై సెటర్లు వేశావ్.. ఇప్పుడు నిన్ను ఎలా ఎగతాళి చేయాలో చెప్పు అని అడుతున్నారు.
WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc
— The Post Millennial (@TPostMillennial) March 19, 2021
Here is the whole video. Rubio stumbled as well. Was raining before.
Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025
BREAKING: President Trump appears to stumble while boarding Air Force One. pic.twitter.com/Wt9hcM2O0E
— Leading Report (@LeadingReport) June 8, 2025