Hormuz Strait: ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణమం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్‌లో దీనికి ఆమోదం లభించింది. టెల్ అవీవ్, యూఎస్ పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Read Also: Pakistan: నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ సిఫార్సుపై పాకిస్తానీయులు ఆగ్రహం
అయితే, ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న ఇరుకైన జలసంధి ఇది. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ రూట్ నుంచి రోజుకి 2 కోట్ల బారెళ్ల చమురు పలు దేశాలకు వెళ్తుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్‌ల నుంచి దిగుమతి అవుతోంది. ఇక, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) రవాణాకు కూడా అత్యంత కీలకం ఈ జలసంధి. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే అనేక దేశాలకు వెళుతుంది.
Read Also: Jagan Convoy Accident: జగన్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై టీడీపీ తప్పుడు ప్రచారం.. వైసీపీ ఫైర్!
మరోవైపు, హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ తన అవసరాల్లో 90 శాతం ముడి చమురును విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందులో 40 శాతం హర్మోజ్ జలసంధి నుంచే రవాణా చేసుకుంటుంది. అయితే, ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. కాగా, ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువపైనా కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.