Hands off Iran: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతలతో యూఎస్ ప్రధాన నగరాల్లో ఇరాన్‌కి మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం ఇప్పుడు తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఆవరణలోనే డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలతో ఓ ప్రదర్శన కొనసాగడం గమనార్హం.
Read Also: Jasprit Bumrah: అప్పటివరకు క్రికెట్ ఆడుతా.. బుమ్రా కీలక వ్యాఖ్యలు!
ఇక, ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు సపోర్టు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు ఇరాన్ జెండాలను పట్టుకుని నినాదాలు చేశారు. అలాగే, మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా రూడ్ల పైకి వచ్చిన పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అగ్రరాజ్యం అమెరికాలోని ప్రధాన నగరాలు.. బోస్టన్, చికాగో, న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ కొందరు నిరసన చేపట్టారు. శ్వేతసౌధం వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని నినాదాలు చేశారు.
Read Also: RK Roja: అది ఫేక్ వీడియో.. ఎక్కడికైనా వెళ్లి టెస్ట్ చేసుకోమనండి..
అయితే, టెహ్రాన్‌పై అమెరికాకు చెందిన B-2 బాంబర్లు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణు కేంద్రాలైన ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్‌లపై దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూఎస్ లో యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు, ఆందోళనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB
— Ron Smith (@Ronxyz00) June 22, 2025
Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG
— BreakThrough News (@BTnewsroom) June 18, 2025