Israel Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిణామాలు ప్రపంచదేశాలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణు ఫెలిసిటీలు లక్ష్యంగా శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది. వీటిలో పాటు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతం చేసింది. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్ లోని జెరూసలెం, హైఫా, టెల్ అవీవ్ నగరాలను టార్గెట్ చేస్తూ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
ప్రస్తుతం ఈ ఘర్షణ ఐదో రోజుకు చేరుకుంది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా నుంచి ఒక డెడ్లీ ఆయుధాన్ని కోరుతోంది. ‘‘ 14,000 కిలోలు ఉంటే బంకర్ బస్టర్’’ బాంబు కావాలని ఇజ్రాయిల్ అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. ఇరాన్‌లోని అత్యంత సురక్షితమైన బలమైన అణు కేంద్రాన్ని నిర్మూలించడానికి ప్రపంచంలోనే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబు అయిన యూఎస్ తయారు చేసిన ‘‘మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్(MOP)ని అడుగుతోంది.
ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అయితే, పర్వతం కింద లోతుగా ఉన్న ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్‌ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. 200 అడుగుల రీఇన్‌ఫోర్సుడ్ రాతిని ఛేదించగల సామర్థ్యం కేవలం 14 టన్నుల ఎంఓపీకి మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయిల్ వద్ద ఈ బాంబు లేదు. దీంతో ఈ బాంబు కావాలని అమెరికాపై ఒత్తిడి తెస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి.
MOP అంటే ఏమిటి?
అధికారంగా GBU-57A/B అని పిలువబడే మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP), యూఎస్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన నాన్-న్యూక్లియర్ బంకర్ బస్టర్ బాంబు. దాదాపుగా 14,000 కిలోలు ఉన్న ఈ బాంబు భూగర్భంలో ఉన్న బంకర్లను కూడా ఛేదిస్తుంది.
బోయింగ్ రూపొందించి ఈ బాంబు రాతి, రీఇన్‌ఫోర్సుడ్ కాంక్రీట్ గుండా లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది దాదాపుగా 2400 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఈ బాంబు భూగర్భంలో ఉన్న నిర్మాణాల్లోకి చొచ్చుకువెళ్లిన తర్వాత మాత్రమే పేలుతుంది. దీంతో అంతర్గతంగా నిర్మాణాలను దెబ్బతీస్తుంది.
ఎలా పనిచేస్తుంది..?
జీపీఎస్, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS)తో అనుసంధానించబడిన బంకర్ బస్టర్ బాంబు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. దీని గైడెన్స్ సిస్టమ్ బాంబు దాని లక్ష్యాన్ని కొన్ని మీటర్ల తేడాతోనే దెబ్బ కొడుతుంది. రీన్‌ఫోర్స్డ్ ఎర్త్ లేదా కాంక్రీటు నుండి 200 అడుగుల (సుమారు 60 మీటర్లు) వరకు చొచ్చుకుపోగల సామర్థ్యం దీని సొంతం.ప్రస్తుతం ఇది యూఎస్ నౌకాదళంలో ఈ బాంబును మోసుకెళ్లేందుకు ఉన్న ఏకైక విమానం బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. దీంతో రెండు ఎంఓపీలను మోహరించవచ్చు.