North Korea: ఉత్తర కొరియా తొలిసారిగా తన సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా అభ్యంతరాలను పెడచెవిన పెట్టి, కిమ్ జోంగ్ ఉన్ శాటిలైట్ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా నిర్వహించ స్పై శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర చేసిందని అమెరికా అధికారి ఆరోపించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నిన్న కథనాన్ని ప్రచురించింది. అయితే అమెరికా ఈ హత్య ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. అయితే పన్నూను హత్య చేసే కుట్రలో ప్రమేయం ఉందని తెలియగానే భారత్ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అన్నారు. అయితే వాట్సన్ వ్యాఖ్యల్ని…
Illegal Immigrant: అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మెరుగైన అవకాశాలు, జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు.
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్రయేమం ఉందని, భారతదేశానికి అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
North Korea: ఉత్తర కొరియా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సాయుధ దళాలు వెల్లడించాయి. దక్షిణం వైపుగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఈ ప్రయోగాన్ని ధృవీకరిస్తూ జపాన్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత దక్షిణ కొరియా ప్రయోగం గురించి మంగళవారం ప్రకటించింది.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోవాలో శనివారం ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామస్వామి తన భార్య అపూర్వ న్యూయార్క్ లోని మెడికల్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఆమెకు గర్భస్రావం జరిగిందని, మొదటి బిడ్డను కోల్పోయామని, రెండోసారి కూడా గర్భస్రావం జరుగుతుందేమో అనే భయాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.
HIV- Hepatitis: అమెరికాలో ఓ ఆస్పత్రి నిర్వాకం వల్ల 450 మంది రోగులు ప్రాణాంతక హెచ్ఐవీ, హెపటైటిస్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. కొంతకాలంగా సదరు ఆస్పత్రిలో ఎండోస్కోపీ చేయించుకుంటున్న రోగులు ఈ రిస్క్ బారిన పడ్డారు. ఎండోస్కోపీ విధానంలో శరీరంలోనికి పంపే ట్యూబుతో కూడిన పరికరం ఇందుకు కారణమైందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎండోస్కోపీ పరికరంలో లైట్, కెమెరా అమర్చి ఉంటాయి. ఇవి కడుపులోని భాగాలను పరిశీలించి రోగ నిర్థారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే…
Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్‌లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21…
Snake Robot: నాసా.. అమెరికా అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం అనేక దేశాలతో పోలిస్తే నాసా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుంది. ఆర్టిమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధమౌతోంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంగారకుడి పైకి కూడా మానవ సహిత యాత్రలను నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది.
Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.