Shark Attack: పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్‌లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది.
Kim Jong Un: ఉత్తర కొరియా ఇటీవల తన మొదటి సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. దీనికి ముందు రెండుసార్లు ఇలాగే ప్రయోగాలు చేయగా.. విఫలమైంది. అయితే ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తప్పపట్టింది. అయితే కిమ్ పంపిన ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆ దేశ అంతరిక్ష అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు.
White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ‘వైట్ లంగ్ సిండ్రోమ్’ అని పిలువబడుతున్న బ్యాక్టీరియా, న్యూమోనియా కొత్త వ్యాప్తిగా చెప్పబడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి చైనాతో పాటు డెన్మా్ర్క్, అమెరికా, నెదర్లాండ్స్‌లోని పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మూడు నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తోంది.
Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
Henry Kissinger: ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ కిస్సింజర్ తన 100వ ఏట కన్నుమూశారు. భారత్‌తో అమెరికా బంధాన్ని మరింతగా బలపరుచుకోవాలని కోరుకున్న నేతగా కిస్సింజర్కి పేరుంది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ యూఎస్ పర్యటనలో వీల్ చైర్లో ఉండీ కూడా కిస్సింజర్ హాజరయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లంచ్‌లో మోడీ స్పీచ్ వినేందుకు ఆయన…
USA: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ అనే వ్యక్తి తాత, అమ్మమ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), బింధు బ్రహ్మభట్(72), యష్ కుమార్ బ్రహ్మభట్(38)లను కాల్చి చంపాడని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ విభాగం, మిడిల్ సెకస్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్ ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఇంటిలో నుంచి కాల్పులు శబ్ధం విన్నట్టు ఇరుగుపొరుగు వారు…
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్రపన్నిందని, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అమెరికా గడ్డపై అమెరికా పౌరుడిని హత్య చేసే కుట్రను ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వైట్‌హౌజ్ ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్‌కి అత్యున్నత స్థాయిలో తమ ఆందోళన చేశామని, దీనికి బాధ్యులు బాధ్యత వహించాలని అమెరికా ఇండియాను హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం…
USA: అమెరికాలో ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అతని బాయ్‌ఫ్రెండ్ కంటిని నీడిల్స్‌తో పొడిచింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళ అతని కంటిలో రేబిస్ సూదితో పొడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
America: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని, అయితే అమెరికా ఈ కుట్రను భగ్నం చేసిందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై అమెరికా తన ఆందోళనను భారత్‌కి తెలియజేసింది. అమెరికా లేవనెత్తిన అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పంజాబ్‌ని భారత్ నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో పన్నూ, కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ఖలిస్తాన్ రెఫరెండానికి…