USA: అమెరికాలో తాత, మామలను కాల్చిచంపిన భారతీయ విద్యార్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ అనే వ్యక్తి తాత, అమ్మమ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), బింధు బ్రహ్మభట్(72), యష్ కుమార్ బ్రహ్మభట్(38)లను కాల్చి చంపాడని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ విభాగం, మిడిల్ సెకస్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్ ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఇంటిలో నుంచి కాల్పులు శబ్ధం విన్నట్టు ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చేరుకునే సరికి ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఓం బ్రహ్మభట్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ ఆయుధాలు కలిగి ఉన్న కేసులను నమోదు చేశారు. గుజరాత్‌కి చెందిన ఓం, బాధితులతో కలిసి ఉంటున్నాడు. ఓం తల్లిదండ్రులు దిలీప్ కుమార్ బ్రహ్మభట్ ఒత్తిడి మేరకు అతడిని అమెరికాకు పంపించినట్లు బంధువులు తెలిపారు.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
Read Also: KBC: కేబీసీలో కోటి గెలిచిన 12 ఏళ్ళ కుర్రాడు.. కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే?
ఓం గత రెండు నెలల క్రితమే న్యూజెర్సీ వెళ్లాడని, కాండోలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఓం తుపాకీతో నేరం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం కోర్టుకు హాజరైన సమయంలో ప్రశాంతంగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేసింది ఎవరని ప్రశ్నించిన సమయంలో..ఓం ‘‘ అది నేనే కావచ్చు’’ అని సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దిలీప్‌కుమార్, బిందు నిద్రిస్తున్న సమయంలో తలపై కాల్చినట్లు ఓం పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి యషుకుమార్ తలపై పలుచోట్ల కాల్పులు జరిపాడని విచారణలో తేలింది. అయితే అసలు అతను ఎందుకు ఈ హత్యలు చేశాడనే విషయంపై స్పష్టత రాలేదు.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..