Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. తాజాగా నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే అది నాలుగేళ్ల గందరగోళం, ప్రతీకారాలు, నాటకీయత కావచ్చని, అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించగలదని ఆమె విమర్శించారు. దేశాన్ని…
USA: అమెరికాలో ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది. ఇలా నలుగురిని హత్యలు చేసిన రెబెక్కాపై పోలీసులు బుధవారం అభియోగాలు మోపారు.
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది.
Salmonella Outbreak: అమెరికాను సాల్మొనెల్లా బ్యాక్టీరియా కలవరపెడుతోంది. సాల్మొనెల్లా వ్యాప్తి 22 అమెరికా రాష్ట్రాల్లో 73 మందిని ప్రభావితం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) ప్రకారం ఈ వ్యాప్తికి ముక్కలుగా చేసిన ఉల్లిపాయాలు కారణమవుతున్నాయని తేలింది. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రి పాలయ్యారు.
China: చైనాలో వరసగా పలువురు మంత్రులు పదవులను కోల్పోవడమో, లేకపోతే కనిపించకపోవడమో జరుగుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి తమ పదవులను కోల్పోయారు. రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన లీ షాంగ్ఫూ దేశం తరుపున అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. తాజాగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వం లీ షాంగ్‌ఫుని తొలగించినట్లు అక్కడి మీడియా
Skin Cancer: వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స కలిగిలేము. ఇందులో క్యాన్సర్ కూడా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతం చేశాడనే చెప్పాలి. హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ తో పోరాడేందుకు ఓ సబ్బును కనుగొన్నాడు. 2023 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో 9 మంది వ్యక్తులతో పోటీ పడిన అతను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా విజయం సాధించాడు.…
Pakistan: పాకిస్తాన్ ఆప్తమిత్రుడు చైనా ఆ దేశానికి కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్‌ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్‌కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్‌ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.
ఇదిలా ఉంటే భారత్ వియన్నా కన్వెన్షన్ ను ఉల్లంఘిస్తుందని కెనడా గగ్గోలు పెడుతోంది. అయితే దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూటిగా సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.